Nee Kosam Song Lyrics in Telugu
నీకోసం ఒక మధుమాసం
అందించిన ఈ జన్మ నీదేనే చెలి కొమ్మ
తనలో చిగురాశల గంధం
నీ శ్వాసకి పంచమని
చలిగాలికి చెరగని బంధం
నీ నవ్వుతో పెంచమని
నీకోసం ఒక మధుమాసం
అందించిన ఈ జన్మ నీదేనే చెలి కొమ్మ
దూరంగానే ఉంటా నువ్వు కందే మంటై చేరగా
దీపంలా చూస్తుంటా నడి రేయంతా నీ తోడుగా
కణకణాన్ని రగిలిస్తున్న చెలి సంకెళ్ళు తెగేట్టుగా
నీకోసం ఒక మధుమాసం
పాదం నేనై వస్తా దరిచేరే దారే చూపగా
ప్రాణం పందెం వేస్తా ప్రతి గెలుపు మెళ్ళో వాలగా
కలలెట్టున్నా నీ ముందొచ్చి నిలబడాలి నిజాలుగా
నీకోసం ఒక మధుమాసం
అందించిన ఈ జన్మ నీదేనే చెలి కొమ్మ
తనలో చిగురాశల గంధం
నీ శ్వాసకి పంచమని
చలిగాలికి చెరగని బంధం
నీ నవ్వుతో పెంచమని
నీకోసం ఒక మధుమాసం